తొమ్మిది నెలల్లో రూ. 1.15 లక్షల కోట్ల రుణాలు రద్దు..!

by Harish |
తొమ్మిది నెలల్లో రూ. 1.15 లక్షల కోట్ల రుణాలు రద్దు..!
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న వారిని పీడించి మరీ వసూలు చేసే బ్యాంకులు..భారీ రుణాల విషయంలో మాత్రం తమ ఉదారతను చూపుతాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో వివిధ బ్యాంకులు ఏకంగా రూ. 1.15 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశాయని అని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.

ఆర్‌బీఐ, బ్యాంక్ బోర్డుల వివరాల ప్రకారం..మొండి బకాయిలుగా నిర్ధారించిన రుణాలను బ్యాంకు రద్దు చేస్తాయి. అలా, గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో రూ. 1.15 లక్షల కోట్ల రుణాలు రద్దయ్యాయని అనురాగ్ సింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ. 5.85 లక్షల కోట్లను బ్యాంకులు రద్దు చేశాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ రుణాలను..రుణ గ్రహీతల నుంచి వసూలు చేయడానికి బ్యాంకులు తమ ప్రక్రియను కొనసాగిస్తాయని ఆయన వివరించారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 2,36,265 కోట్లు, 2019-20లో రూ. 2,34,170 కోట్లు, 2020-21, మొదటి ఆర్థిక సంవత్సరంలో రూ. 1,15,038 కోట్లను బ్యాంకులు రద్దు చేశాయి.

Advertisement

Next Story