హెచ్‌డీఎఫ్‌సీలో చైనా బ్యాంకు మరింత వాటా

by vinod kumar |   ( Updated:2020-04-12 20:02:16.0  )
హెచ్‌డీఎఫ్‌సీలో చైనా బ్యాంకు మరింత వాటా
X

మార్చి త్రైమాసికం ముగిసే తనఖా రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లో వాటాను చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పెంచుకుంది. ఎక్స్ఛేంజీ వద్ద లభ్యమతున్న సమాచారం ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ పీపుల్స్ బ్యాంక్ చైనాకు 1,74,92,090 షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్ క్యాపిటల్ లో ఇది 1.01 శాతానికి సమానం.కరోనా భయాలతో గత రెండు నెలల్లో సూచీలు గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. ఇదే సమయంలో భారత్ లో పెట్టుబుడులు పెట్టేందుకు చైనా బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఏ ధర వద్ద కొనుగోలు చేసిందన్న వివరాలు తెలియలేదు. జనవరి 1న రూ.2,433.75 వద్ద హెచ్‌డీఎఫ్‌సీ షేరు..మార్చి 31కి రూ.1,630.45కు దిగొచ్చింది.

Tags: HDFC,people bank of chaina,banking

Advertisement

Next Story

Most Viewed