పండుగ ఆఫర్లను ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ బరోడా!

by Harish |
పండుగ ఆఫర్లను ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ బరోడా!
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ (Festival time) సందర్భంగా ప్రభుత్వ యాజమాన్య బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of baroda) గృహ, కారు రుణగ్రహీతలకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్టు మంగళవారం ప్రకటించింది. బరోడా గృహ రుణాలు, బరోడా కారు రుణాలకు ప్రస్తుతం వర్తిస్తున్న రేట్లలో 0.25 శాతం మాఫీని అందిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది.

‘ఈ ఏడాది పండుగ సీజన్ కోసం రిటైల్ లోన్ ఆఫర్ల (Retail loan offers)ను తీసుకురావడం ద్వారా ఇప్పటికే ఉన్న విశ్వసనీయ కస్టమర్లకు బహుమతిగా ఇవ్వాలని భావించాం. అంతేకాకుండా, కొత్త వినియోగదారులు కారు రుణాలు పొందడానికి, తక్కువ రేట్లతో లబ్ది పొందేందుకు గృహ రుణాలు ఆకర్షణీయంగా ఉండనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్, జనరల్ మేనేజర్ హెచ్ టి సోలంకి (HT solanki) ఓ ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈ ఆఫర్లపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ మరింత ఆకర్షణీయంగా ఉంటుందని, రేట్ల తగ్గింపుతో తమ కస్టమర్లు గృహ రుణాలను తీసుకోవడానికి ముందుకొస్తారని, కారు రుణాలకు ఆసక్తి చూపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story