ఫోర్జరీ సంతకాలతో డబ్బులు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్

by Sumithra |   ( Updated:2021-12-27 11:17:07.0  )
ఫోర్జరీ సంతకాలతో డబ్బులు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్
X

దిశ, కొత్తగూడ: మహిళా గ్రూప్ సభ్యులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో ఇండియన్ బ్యాంక్ మేనేజర్, వీవోఏలు 10 లక్షల రూపాయలు మాయం చేసిన విషయం కొత్తగూడలో ఆలస్యంగా వెలుగుచూసింది. గత నాలుగు రోజుల క్రితం ఎదుళ్లపల్లికి చెందిన మహిళా పొదుపు సంఘాలు బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం అభ్యర్థించారు. వారి అకౌంట్‌ను పరిశీలించగా మేనేజర్ అప్పటికే రూ. 10 లక్షలు తీసుకున్నట్టు స్టేట్‌మెంట్‌లో తేలింది. దీంతో ఇదే విషయాన్ని బాధిత మహిళా సంఘాలకు చెప్పాడు.

వెంటనే వీఓఏ దండు శోభన్‌ పట్టుకుని నిలదీయగా.. పాత మేనేజర్ ఆ డబ్బును కొట్టేశాడని అసలు విషయం చెప్పాడు. ఫోర్జరీ వ్యవహారం బయటపడడంతో పాత బ్యాంక్ మేనేజర్ పూర్ణ చందర్ కాంప్రామైజ్ కోసం ఓ ముగ్గురు వ్యక్తులను పంపి బాధితులను సముదాయించే ప్రయత్నం చేశాడు. రెండు రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి ముఖం చాటేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తమకు ఇప్పించాలని కొత్తగూడలో ధర్నా చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story