బ్యాన్‌ఐపీఎల్.. బీసీసీఐ ముందు నెటిజన్ల సంచలన డిమాండ్

by Anukaran |   ( Updated:2021-11-01 07:50:46.0  )
బ్యాన్‌ఐపీఎల్.. బీసీసీఐ ముందు నెటిజన్ల సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: వెంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టు.. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమి ఐపీఎల్‌ను వివాదంలోకి నెట్టింది. ఏకంగా రిచ్ ప్రీమియర్‌ లీగ్‌ను రద్దు చేయాలనే సంచలన డిమాండ్ బీసీసీఐ ముందుకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అసలు సంగతి ఏంటంటే..

కోహ్లీ సారథ్యంలోని టీమిండియా వరుసగా ఐసీసీ ట్రోఫీల్లో విఫలం అవుతోన్న సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్స్ షిప్‌ ఇలా 8 ఏళ్లుగా అన్ని ఐసీసీ ట్రోఫీల్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. దీనికితోడు ప్రస్తుత టీ20లో(గ్రూప్‌ మ్యాచుల్లో) కూడా వరుస ఓటములతో మెంటార్ ధోని, కెప్టెన్సీలో కోహ్లీ, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రిలను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత న్యూజీలాండ్‌తో గెలుస్తారనుకున్నా.. ఈ మ్యాచ్‌లో కూడా దారుణంగా విఫలమైంది టీమిండియా.

https://twitter.com/iAmKingAbbasi/status/1455084337712533507?s=20

టీమిండియాకు షాక్.. అంపైర్ మళ్లీ అతడే.. WTC రిపీటేనా..?

ఇందులోనూ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌‌గా ఉండడంతో మ్యాచ్‌ డౌటే అంటూ అభిమానులు ముందే తేల్చేశారు. నిజానికి న్యూజీలాండ్‌ భారత్‌పై పూర్తి ఆధిపత్యం కనబర్చింది అంటూ భారత మాజీ క్రికెటర్లు సైతం చెప్పకనే చెప్పారు. తప్పంతా ఆటగాళ్లదే అంటూ ఎత్తిచూపారు. ఈ వ్యవహారాన్ని అంతటితో వదిలేశారు సెలబ్రిటీలు. కానీ, టీమిండియా ఓటమిని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ముందు సంచలన డిమాండ్‌ పెట్టారు.. ఇక ఇదే వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.‌

అదేంటో తెలుసా..!

ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఆదరణ కలిగిన, రిచ్ ప్రీమియర్ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(IPL)ను‌ రద్దు చేయాలంటూ సంచలన డిమాండ్‌ బీసీసీఐ ముందు ఉంచారు. దీంతో అటు క్రికెటర్లే కాకుండా అభిమానులు సైతం ఖంగుతిన్నారు. ముఖ్యంగా బీసీసీఐ తలపట్టుకున్నంత పనైంది. వాస్తవానికి ఐపీఎల్‌ ద్వారా కొత్త కొత్త ఆటగాళ్లు ఈ రంగంలో తమ సత్తాను చాటుకుంటున్నారని ఇది వరకు ఉన్న నానుడి. కానీ, ఇప్పుడు అదే ఐపీఎల్‌ టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపుతోందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

https://twitter.com/S_Khan75c/status/1455100267897237509?s=20

డబ్బులకు క్రికెట్ దాసోహమా..?

కేవలం డబ్బుల కోసమే ఆటగాళ్లు క్రికెట్ ఆడుతున్నారా లేక దేశం కోసం ఆడుతున్నారా అనే విధంగా కూడా నెటిజన్లు కొత్త సందేహాన్ని లేవనెత్తారు. అడ్వర్టైజ్‌మెంట్‌లలో మెరిసే ఆటగాళ్లు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వరల్డ్ కప్‌ సిరీస్‌లల్లో చేతులెత్తేయడం ఏంటని మండిపడుతున్నారు. అటు ఐపీఎల్‌లో కూడా రూ. కోట్లు పెట్టి ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు.. కానీ, టీ20 వరల్డ్‌ కప్‌లో సెలెక్ట్ చేయడమే గొప్పగా భావిస్తారు. అయినప్పటికీ వీరికి బీసీసీఐ గౌరవ వేతనం చెల్లిస్తోంది. కానీ, ఐపీఎల్‌కు, డబ్బులకు అలవాటు పడిన ఆటగాళ్లు.. అంతర్జాతీయ మ్యాచుల్లో రాణించడం లేదంటూ అభిమానులు, నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్‌ను రద్దు చేసి టీమిండియా జట్టును అంతర్జాతీయ మ్యాచ్‌లపై, ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీలపై ఫోకస్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీసీసీఐ కమర్షియల్ మాత్రమే కాకుండా.. అభిమానుల ఎమోషనల్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను తయారు చేయాలని మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. ప్రతి ఏడాది ఐపీఎల్ పెట్టి క్రికెటర్లకు రెస్టు లేకుండా చేస్తున్నారంటూ బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు.

బీసీసీఐ స్పందన ఇదే..!

టీ20 వరల్డ్‌ కప్‌‌లో టీమిండియా ఓటమిపై స్పందించిన బీసీసీఐ జట్టును వెనకేసుకొచ్చిందనే చెప్పాలి. తొలి మ్యాచ్ పాకిస్తాన్ ఓటమి తర్వాత జట్టు కెప్టెన్‌తో పాటు బీసీసీఐ సైతం వచ్చే మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండో మ్యాచ్‌లోనూ ఇదే రిపీట్ అయింది. దీంతో వచ్చే మూడు మ్యాచులపై ఫోకస్ చేస్తామంటూ బీసీసీఐ మరో ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. టీమిండియా స్కోరు కనీసం పెట్రోల్ ధరనే దాటలేదు.. అలాంటిది 100 పరుగుల భారీ తేడాతో ఎలా గెలుస్తారో చెప్పాలంటూ ఎద్దేవా చేయడం గమనార్హం. అందివచ్చిన అవకాశాలను స్వీకరించలేని టీమిండియా.. అద్భుతాలు సృష్టిస్తోందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!

https://twitter.com/Zahrakhanpak911/status/1455034261862555648?s=20

Advertisement

Next Story

Most Viewed