అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా బంగారు శృతి..? సోషల్ మీడియాలో వైరల్

by Sridhar Babu |
acchampeta1
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గగం నుండి రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి అచ్చంపేట అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకురాలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటుంది. అలాగే 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ ముందుకు దూసుకుపోతున్న తరుణంలో అచ్చంపేట నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే అచ్చంపేట నియోజకవర్గ నాయకులతో ఎక్కువ మొత్తంలో కలిసి ఉన్నట్లుగా తెలుస్తుంది.

జిల్లా నాయకత్వానికి సమాచారం లేదు

అచ్చంపేట బీజేపీ పార్టీ అభ్యర్థిగా బంగారు శృతి రాబోతున్న విషయం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న విషయాన్ని జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజును దిశ ప్రతినిధి గురువారం తెలుసుకునే ప్రయత్నం చేయగా.. బంగారు శృతికి జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్న విషయం వాస్తవం అని, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుందని, నిజా నిజాలు తేలాల్సి ఉందని, ఈ విషయంపై రాష్ట్ర పార్టీ నుండి మాకు ఎలాంటి సంకేతాలు అందలేదని… ఉంటే ఉండొచ్చుని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story