బెంగళూరులో రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు..

by Shamantha N |
బెంగళూరులో రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు..
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (BMTC)లో ఓ సెక్షన్ కార్మికులు బుధవారం రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేపట్టారు. సమయానికి తమకు జీతాలు చెల్లించడం లేదని ఓవర్ వర్కింగ్ హావర్స్ డ్యూటీ చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా తమకు సమయానికి వేతనాలు చెల్లించాలని, మహిళా కార్మికులకు అధిక పని గంటలు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.లేనియెడల తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Next Story