లాక్‌డౌన్ వద్దనుకుంటే సహకరించండి: కర్ణాటక సీఎం

by Shamantha N |
లాక్‌డౌన్ వద్దనుకుంటే సహకరించండి: కర్ణాటక సీఎం
X

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్ వద్దనుకుంటే కరోనా కట్టడికి ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు తప్పక పాటించాలని, కరోనాపై పోరులో సర్కార్‌కు సహకరించాలని రాష్ట్ర సీఎం బిఎస్ యడ్యూరప్ప ప్రజలను కోరారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని నగరంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నదా? అనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కరోనాకు కళ్లెం వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం, శుక్రవారం రెండు రోజులు మంత్రులు, అధికారులతో చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. సిటీకి చెందిన అన్ని పార్టీల చట్టసభ్యులు, మంత్రులతో రేపు చర్చించి లాక్‌డౌన్‌పై అభిప్రాయాన్ని తీసుకోనున్నట్టు వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బెంగుళూరులో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు మంగళవారం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెంగళూరులో అత్యధిక కేసులు రిపోర్టు అవుతున్న కొన్ని ఏరియాల్లో లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed