బండ్ల మరో సంచలన ప్రకటన.. షాక్ లో ఫ్యాన్స్.. అసలేం జరిగింది..?

by Shyam |   ( Updated:2021-10-01 06:39:38.0  )
bandla-ganesh
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతోన్నాయి. ఎవరు.. ఎప్పుడు బరిలోకి దిగుతున్నారు, ఎవరు.. ఎందుకు డ్రాప్ అవుతున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక వీరందిరిలోను బండ్ల గణేష్ వైఖరి ఆందోళన తెప్పిస్తోంది. మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్న బండ్ల ఆ తరువాత బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా నిలబడతాను అంటూ ప్రకటించాడు. తనకు తగ్గ ప్రమోషన్ తాను చేసుకొంటూ వార్తలో నిలిచాడు. మా లో రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయని, తనను కనుక గెలిపిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీలు కూడా ఇచ్చాడు. ఇక అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ఊహించిన షాక్‌ ఇచ్చాడు. ఇటీవలే జనరల్ సెక్రెటరీ పదవికి నామినేషన్ వేసిన బండ్ల.. నామినేషన్ విరమించుకొంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు.

సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్‌లతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను ‘మా’ జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అంటూ ట్వీట్‌ చేసి అందరికి షాక్‌ ఇచ్చాడు. ఇక దీంతో మరోసారి బండ్ల వార్తల్లో నిలిచాడు. సడెన్ గా బండ్ల ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు నిజం ఏంటి..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా అతడిని బెదిరించారా..? లేక డబ్బు ఆశ చూపారా..? అని అభిమానులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని కామెంట్ల రూపం లో వ్యక్తం చేస్తున్నారు. మరి బండ్ల నామినేషన్ వెనక ఉన్నది ఎవరు..? ఉపసంహరించుకోవడం వెనక హస్తం ఎవరిది..? అనేది తెలియాల్సిఉంది.

Advertisement

Next Story

Most Viewed