‘పవన్ కళ్యాన్ నా దేవుడు.. నేను బానిసను’

by Shyam |   ( Updated:2020-12-25 06:33:24.0  )
‘పవన్ కళ్యాన్ నా దేవుడు.. నేను బానిసను’
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో పనవ్ కళ్యాణ్. ఇండస్ట్రీలోనూ అనేకమంది హీరోలు తాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెబుతుంటారు. అందులో ముఖ్యంగా హీరో నితిన్, డైరెక్టర్ హరీశ్ శంకర్, నిర్మాత, కమెడీయన్ బండ్ల గణేశ్. వీరు ప్రతి ఫంక్షన్‌లో తాము పవన్ వీరాభిమానిమని పబ్లిక్‌గా చెప్పారు. తాజాగా మరోసారి క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై తనకి ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ రూపంలో తెలిపారు. రీసెంట్ గా తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ తనకి పంపిన క్రిస్మస్ కానుకను హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ అందుకున్నారు. ఆ గిఫ్ట్ అందుకుని పవన్‌పై తనకి ఉన్న ప్రేమను మరోసారి చాటారు. ప్రస్తుతం వారు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పవన్ పంపిన క్రిస్మస్ కానుకను తన మెమోరబుల్ ఫోటో దగ్గర పెట్టి.. ‘పవన్ కళ్యాణ్‌కి నేనెప్పుడూ బానిసనే. నా దేవుడు పవన్ కళ్యాణ్’ అంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేశ్. ప్రస్తుతం బండ్ల ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేగాకుండా ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అద్భుతమైన కానుకలు పంపించినందుకు కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భమున మిమ్మల్ని ఆ దేవుడు శాంతి, ఆరోగ్యం మరియు ఆనందంతో ఆశీర్వదిస్తాడు.’ అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed