రాజమౌళికి బండి సంజయ్ వార్నింగ్ !

by Anukaran |   ( Updated:2020-10-31 09:36:26.0  )
రాజమౌళికి బండి సంజయ్ వార్నింగ్ !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డైరెక్టర్ రాజమౌళికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన… ఆర్ఆర్ఆర్ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందులో కొమరం భీంకు ఎందుకు టోపీ పెట్టారని ప్రశ్నించారు. దమ్ముంటే నిజాం రజాకార్లకు బొట్టు పెట్టి సినిమా తీయి అని సవాల్ విసిరారు. డైరెక్టర్ రాజమౌళిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.. కొమురం భీంకు టోపీ ఉంటే ఈ సినిమా ఎలా విడుదల అవుతుందో చూస్తాం, మాబిడ్డను కించపరిచేలా టోపీ పెట్టావు, ఓల్డ్‌సిటీలో వారికి కాషాయం కండువా వేసి సినిమా తీసే దమ్ముందా ! బిడ్డా రాజమౌళి… మూవీని రిలీజ్ చేస్తే బరిగలతో కొట్టిచంపుతామని హెచ్చరించారు.

జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా రూపుదిద్దుకుంటుండగా… ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చివరలో ఎన్టీఆర్‌ టోపీ పెట్టుకొని కనిపించడంతో ఈ సినిమాపై వివాదం రేగుతోంది. రెండ్రోజుల క్రితమే ఓ బీజేపీ ఎంపీ.. డైరెక్టర్ రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story