- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూలే ఆశయాలను బీజేపీ కొనసాగిస్తోంది : బండి సంజయ్
దిశ,తెలంగాణ బ్యూరో: సంఘసంస్కర్త, బీసీల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా దేశంలో దేశభక్తుల పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. బీసీల కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రజల మన్ననలను పొంది మహాత్మునిగా పిలిపించుకున్న గొప్ప వ్యక్తి పూలే అన్నారు.
జ్యోతిరావు పూలే ఆశయాలను బీజేపీ కొనసాగిస్తుందని, అందులో భాగంగానే బడుగు వర్గాల నుంచి వచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ తమ పార్టీలో ప్రధానమంత్రి కాగలిగారన్నారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని, బీసీల అణిచివేత కొనసాగుతుందన్నారు, తెలంగాణలో కేసీఆర్ మూర్ఖపు పాలన నడుస్తోందని పేర్కొన్నారు. బీసీలు ప్రగతి భవన్ గడప తొక్కే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో బీసీల అణచివేత జరుగుతున్న సంఘాలు స్పందించడం లేదని, వారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.