మళ్లీ పాతబస్తీ ప్రస్తావన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Shyam |
మళ్లీ పాతబస్తీ ప్రస్తావన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఇస్తోన్న ఆదరణ చూసే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులపై ఫేక్ ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కోట్లు కుమ్మరించి ఎన్నికల్లో గెలువాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. హిందువులు ఉండే ప్రాంతాల్లో విస్తరణ పేరుతో ఇండ్లను కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ధైర్యం ఉంటే పాతబస్తీ రోడ్లు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ అభివృద్ధి టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే అడ్డుకుంటున్నాయని అన్నారు.

Advertisement

Next Story