- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘సీఎంకు టెన్షన్.. కాషాయజెండాకు అనుకూల ఫలితాలు’
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం చేయించుకున్న సర్వేల్లో ఓరుగల్లు పురపోరులో కాషాయ జెండాకు అనుకూలంగా ఫలితాలు రావడంతో టెన్షన్ పడుతున్నారన్నారు. శుక్రవారం హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లీస్తోందని ఆరోపించారు. దీనికితోడు నిధులు ఇచ్చిన కేంద్రానికి గుర్తింపు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
వరంగల్ స్మార్ట్ సిటీకి ప్రభుత్వం తన వాటాగా నిధులు ఇవ్వకపోవడంతో ఇంకా అభివృద్ధి జరగడం లేదని చెప్పుకొచ్చారు. కాకతీయ వంశీయులకు కేసీఆర్ కనీస గౌరవం ఇవ్వలేదన్న బండి సంజయ్.. నిజాం సమాధి వద్ద మోకరిల్లుతూ వారి పాలననే కొనియాడటం సిగ్గు చేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే వరంగల్‌ను ఓరుగల్లు అని నామకరణం చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ నేతలు డబ్బుతో ఓటర్లను మభ్య పెట్టాలని చూస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.