అలా చేస్తే మట్టిలో కలిసిపోక తప్పదు : బండి సంజయ్

by Sridhar Babu |
అలా చేస్తే మట్టిలో కలిసిపోక తప్పదు : బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హిందుత్వాన్ని అణచివేయాలని చేస్తే మట్టిలో కలిసిపోక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు.చరిత్రలో మొఘల్స్, నిజాంకు పట్టిన గతే భవిష్యత్తులో కేసీఆర్ ప్రభుత్వానికి పట్టబోతుందన్నారు. హిందువులకు అత్యంత ప్రీతి పాత్రమైన దీపావళి పండుగ నాడు బాణాసంచా విక్రయంపై ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతీ సారీ హిందూ పండుగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు.

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం బలంగా వాదించకపోవడం వల్లే హైకోర్టు నిషేధం విధించిందన్నారు. హిందువుల పండుగలను వివాదాస్పదం చేయడం ప్రభుత్వానికి ఓ ఫ్యాషన్ అయిపోయిందని విరుచుకపడ్డారు. టపాసుల దుకాణాలకు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి, ఇప్పుడు బంద్ చెయ్యమంటే వాళ్ళు ఎక్కడ పోవాలే? అని ప్రశ్నించారు. పండుగ రోజు టపాసుల నిషేధం వలన నష్టపోతున్న చిరు వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రపంచంలోని 192 దేశాల్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా టపాసులు కాల్చినప్పుడు రాని కాలుష్యం, ఒక్కరోజు దీపావళి వలన వస్తుందా? అని దుయ్యబట్టారు. హిందూ పండుగలను ఆపడం 200ఏళ్లు మనల్ని పాలించిన బ్రిటీష్ వారి వల్లే కాలేదు. మీతో ఏం అవుతుందని కేసీఆర్ నుద్దేశించి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story