- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితులకు రూ. 50 లక్షలు.. బండి సంజయ్ సంచలన డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ని లక్షనాగళ్లతో దున్ని ఆ భూమిని దళితులకు పంచుతామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. నగరంలోని ఇందిరాపార్కు వద్ద శుక్రవారం జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు దీక్షలో బండి సంజయ్ ఘాటు వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌ను కూల్చి 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు కాదు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహుజనుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని సీఎం కేసీఆర్ పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందన్నారు. ఫారెస్ట్ అధికారులను పంపి పోడు భూములను లాక్కొని పంటను నాషనం చేస్తుండటం దారుణం అన్నారు. కేసీఆర్‌కి దమ్ముంటే ఈటల బావమరిది చాటింగ్‌పై విచారణ జరిపించాలన్నారు.
‘హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు ‘దళిత బంధు’ పేరిట ఒక్కో దళితుడికి రూ.10 లక్షలిస్తానని కేసీఆర్ మాయ మాటలు చెబుతుండు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న మాట ఎప్పుడో మర్చిపోయిండు. నిజంగా దళితులకు ఇచ్చే రూ.10 లక్షలతో ఇప్పుడు ఒక్క ఎకరం భూమి కూడా రాదు. మరి దళితులకు మూడెకరాల భూ పంపిణీ హామీ అమలు చేయాలంటే.. ఒక్కో దళితుడికి రూ.30 లక్షలకుపైగా ఇవ్వాలి. ఒక్కో దళితుడికి డబుల్ బెడ్రూం ఇవ్వాలంటే రూ.10 లక్షలు కావాలి. ప్రతి ఒక్క దళితుడికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ హామీ అమలైతే ఈపాటికే ఒక్కో దళిత కుటుంబం రూ.10 లక్షలు సంపాదించుకునేవారు. ఈ లెక్కన తెలంగాణలో ఒక్కో దళితుడికి రూ.50 లక్షలు ఇవ్వాలి.’ అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.