- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీకు భయమంటే ఏంటో చూపిస్తా.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
దిశ, సూర్యా పేట : రాళ్ళ దాడి చేసినా బరిస్తాం, కోడిగుడ్లు వేసినా బరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సంకినేని వెంకటేశ్వరరావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, రైతుల పక్షాన దేనికైనా తెగించి కొట్లాడుతాం, దేన్నైనా సహిస్తాం అన్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య కాదు, ఇది రైతుల సమస్య దయచేసి మీడియా అర్థం చేసుకోవాలన్నారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎవరూ ఉండకూడదని బెదిరించి పంపించివేశారన్నారు. అయినా రైతులు బయట కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారని తెలిపారు. బీజేపీ నాయకులు వస్తున్నారనే వడ్లు కొనుగోలు చేయడానికి కాంట పెట్టించారని కొంతమంది రైతులు సంతోషించారన్నారు. నిన్న జరిగిన ఈ దాడులకు ప్రధాన సూత్రధారి రాష్ట్ర ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు.
రైతుల ఇబ్బందులను ప్రశ్నింస్తే అడ్డుపడుతున్నావ్ అని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్‌లో పడుకుని బయటికి రావు.. నువ్వు చేయాల్సిన పని మేము చేస్తే మా పై దాడులు చేస్తున్నావ్, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనదని విమర్శించారు. వాళ్ళ చేతిలో రాళ్లు ఉన్న విషయం పోలీసులకు తెలుసు, వాళ్లు గ్యాదర్ అయ్యే విషయాలు తెలుసు, రాళ్లు రువ్వితే రైతులకు దెబ్బలు తగులుతాయని తెలుసని, అయినా ఏమి చేయలేకపోయారన్నారు. రైతుల కోసం వానాకాలం పంట కొనేంతవరకు మేము వదిలిపెట్టేది లేదన్నారు. అలాగే వానాకాలం పంటకి సంబంధించి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేస్తామని చెప్పి అగ్రిమెంట్ జరిగిందా లేదా.. అని ప్రశ్నించారు. పంట వేయడంలో నీకంటే 8 రాష్ట్రాలు ముందున్నాయి.. 8 రాష్ట్రాలలో లేని సమస్య ఇక్కడెందుకు ఉందన్నారు. 7 ఏండ్ల క్రితం ఎమ్మెస్పీ 1360 రూపాయలు, ఇపుడు 1960, 2023 వరకు 2000 రూపాయల పైనే చేస్తాంఅన్నారు. రుణమాఫీ చేస్తా అని చేయలేదు, సబ్సిడీలు లేవు, పసల్ భీమా యోజన అమలు చేస్తాలేవు ఇవన్నీ మేము ప్రశ్నించొద్ద అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బంది పెట్టి.. నీ కాళ్లు మొక్కే కలెక్టర్‌లకు ఎమ్మెల్సీ ఇస్తున్నావంటే సమాజానికి ఏం చెబుతున్నావ్ నువ్వు అని ప్రశ్నించారు. రైతాంగం ఆలోచించాలన్నారు వానాకాలం పంట గురించి బీజేపీ ప్రశ్నించక పోతే ఇప్పటికి కూడా కొనుగోళ్లు మొదలుకాకపోవన్నారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తుతో దాడులు చేపిస్తున్నావ్ నీ అవినీతి చిట్టా తీస్తాం నీకు నీ కుటుంబానికి భయం అంటే ఏంటో చూపిస్తాం అన్నారు.