- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీ బంద్ సక్సెస్
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: జీవో నెంబర్ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవాల్ చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. తుడుందెబ్బ ఆధ్వర్యంలో పదికి పైగా వివిధ ఆదివాసీ సంఘాలు ఐక్యంగా బంద్‌లో పాల్గొన్నాయి. గిరిజనేతర సంఘాలు కూడా బంద్‌కు సహకరించాయి. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, జైనూరు, నార్నూర్, ఇంద్రవెల్లి.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి, తిర్యాని, ఆసిఫాబాద్, వాంకిడి తదితర మండల కేంద్రాల్లో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి. ఉదయం నుంచి ఆదివాసీ సంఘాల నేతలు బంద్‌కు సహకరించాలని కోరుతూ దుకాణాలు మూసి వేయించారు. బంద్ జయప్రదం చేయడం కోసం తుడుందెబ్బ నేతలతో పాటు పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకరించారు.
Advertisement
Next Story