- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాజేందర్’ పేరుతో కుట్రలు.. ఈటల గెలుపు ఆగదన్న బండ కార్తీక రెడ్డి
దిశ, హుజూరాబాద్ రూరల్: ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ నీచమైన కుట్రలకు తెరలేపిందని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలోని మధువని గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజేందర్ అనే పేరు ఉన్న వ్యక్తులను గుర్తించి వారితో నామినేషన్లు వేయించి.. ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందుల రాజేందర్‌తో నామినేషన్ వేయాలని ఒత్తిడి చేయడం.. టీఆర్ఎస్ నాయకులు చేసిన కుట్రకు నిదర్శనమన్నారు. ఐదు నెలల నుండి హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతలో సరుకులు కొన్నట్లుగా ఇతర పార్టీ నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నిన ప్రజల హృదయాలలో ఉన్న ఈటల గెలుపును ఆపలేరని కార్తీక రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నల్ల సుమన్, అంపటి శ్రీనివాస్, ముత్యంరావు, హరీష్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.