ఆన్‌లైన్ అంగట్లో అరటి ఆకులు.. ధర అదుర్స్!

by Anukaran |
Banana Leaf
X

దిశ,వెబ్‌డెస్క్ : ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ పుణ్యమా అని ఏదీ కావాలన్న ఇంటికే వచ్చే విధంగా ఎన్నో ఆన్‌లైన్ సైట్లు పుట్టుకొచ్చాయి. నాలుగు షాపులు తిరగందే బట్టలు కొనుక్కోని జనం.. ఆన్‌లైన్‌లో పది సైట్లను చూసి ఇంటి దగ్గర నుంచే కొనేస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఏదీకాదు అనర్హం అన్నట్లు ఊళ్లల్లో ఫ్రీగా దొరికే పిడకలను కూడా అమ్మేసి బిజినెస్ చేసుకుంటున్నారు.

తాజాగా అరటి ఆకులు ఇంటికే డెలవరీ చేస్తామంటున్నారు ఆన్‌లైన్ సంస్థలు. రూ.50లకే 5 అరటాకులు అంటూ తమ సైట్‌లో ఆఫర్ పెట్టారు. వాస్తవ ధర రూ.62.50 ఉండగా.. 20 శాతం ఆఫర్‌తో రూ.50 ధర నిర్ణయించి విక్రయానికి ఉంచారు. ప్రస్తుతం శ్రావణం కావడంతో వీటిని తెగ కొనేస్తున్నారు. అరటి ఆకులో భోజనం చేస్తుంటే పల్లెటూరిలో తిన్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ అరటి ఆకులకు ఆన్‌లైన్‌లో డిమాండ్ పెరిగిపోయింది.

Advertisement

Next Story