అగ్గిరాజేసిన తాండవ్.. ‘సైఫ్’ఇంటికి సెక్యూరిటీ!

by Anukaran |   ( Updated:2021-01-17 23:58:22.0  )
అగ్గిరాజేసిన తాండవ్.. ‘సైఫ్’ఇంటికి సెక్యూరిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : కొత్తగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదలైన ‘తాండవ్’ వెబ్ సిరీస్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అందులో హిందూ దేవుళ్ల మీద, ఆచారాలు పాటించేవారి మీద అసభ్యకరమైన మాటలు, చిత్రీకరణ ఉందని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూవీని బాయ్ కాట్ చేయాలని కోరుతూ ట్విట్టర్‌లో పెద్ద క్యాంపెనియంగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేసిన సైఫ్ అలీఖాన్ ఇంటి ముందు మహా సర్కార్ గట్టి భద్రతను భారీగా పోలీసులు మోహరించారు. కాగా, ఈ మూవీపై రిపబ్లికన్ టీవీ చానల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి స్పందించారు. ఇంకెన్నీ సంవత్సరాలు బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు హిందూ దేవుళ్ల మీద కామెంట్స్ చేస్తారని ఘాటుగా వ్కాఖ్యానించారు.

Advertisement

Next Story