ఫస్ట్ స్పీచ్‌లో అదరగొట్టిన వెంకట్.. BJP, టీఆర్ఎస్‌కు గట్టి పోటీ తప్పదా.?

by Anukaran |   ( Updated:2021-10-08 02:23:57.0  )
ఫస్ట్ స్పీచ్‌లో అదరగొట్టిన వెంకట్.. BJP, టీఆర్ఎస్‌కు గట్టి పోటీ తప్పదా.?
X

దిశ, హుజురాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన తాను హుజురాబాద్ బరిలో నిలిచానని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ వేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల గొంతుకనై వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానన్నారు. విద్యార్థి జంగ్ సైరన్ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. విద్యార్థి నాయకునిగా తనకు అవకాశం ఇచ్చిందన్నారు.

హుజురాబాద్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నడం బిగిస్తానని, గ్రామ గ్రామాన తిరిగి ప్రజల మద్దతు కూడగట్టుకుంటానని వెంకట్ తెలిపారు. రెండు పార్టీలు ఏకమై ప్రజల్ని మభ్యపెట్టి స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఏడేళ్లలో విద్యార్థుల పక్షాన పోరాటం చేసిన తనపై 24 కేసులు నమోదయ్యాయని, రెండుసార్లు జైలు జీవితం గడిపానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన పోరాటాన్ని నిలువరించేందుకు ఎముకలు విరగ్గొట్టినా విద్యార్థి ఉద్యమాల్లో మాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి నాయకుడిని అయిన తనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు తనకు అండగా నిలవాలని వెంకట్ కోరారు.

Advertisement

Next Story