- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిమాన్షుపై కామెంట్స్.. తీన్మార్ మల్లన్నపై బాల్క సుమన్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై వాడిన జుగుప్సాకరమైన భాషను ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం బీజేపీకి కొట్టిన పిండి అని, బీజేపీ విష సంస్కృతిలో ఇదంతా భాగమన్నారు. తీన్మార్ మల్లన్న చర్యలు బీజేపీ ఆటలో భాగమని, బండి సంజయ్ చెబితే మల్లన్న చేస్తారని ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇదే ఎత్తుగడ వేసిందని, తెలంగాణలో కూడా అదే చేస్తోందన్నారు. తెలంగాణ సమాజం బీజేపీ తీరును గమనించాలన్నారు.
‘తీన్మార్ మల్లన్నకు రెండు చెంప దెబ్బలు కాదు.. చెప్పు దెబ్బలు కావాలి. మహిళలను, కుటుంబ సభ్యులను బీజేపీ కించపరుస్తోంది. ఈ ధోరణి బీజేపీకి మంచిది కాదు. నా ఆస్తులపై కూడా బీజేపీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోంది. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న దానికన్నా ఎక్కువ ఆస్తులు ఉంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు రాసిస్తా. ఇలాంటి విష ప్రచారం చేస్తుంటే పోలీసు విభాగం ఏం చేస్తోంది. మేము చాలా సందర్భాల్లో డీజీపీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాం. పోలీసులు చర్యలు తీసుకోకుంటే మా కార్యకర్తలు స్పందిస్తారు. ఇప్పటికైనా డీజీపీ స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని బాల్క సుమన్ చెప్పారు.
- Tags
- balka sunam
- dgp