ఆర్టీసీ సమ్మెకు కారణం నువ్వే కదా ఈటల.. బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్

by Sridhar Babu |
Balka-suman
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. సుమన్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో బీజేపీని విమర్శించిన ఈటల రాజేందర్.. ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో ఎందుకు చేరారంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​పట్ల ఈటల రాజేందర్ వాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

తల్లి లాంటి పార్టీ, తండ్రి లాంటి కేసీఆర్‌ను తిట్టడానికి నోరెలా వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈటలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మామూలు కార్యకర్తగా ఉన్న ఈటల.. రాష్ట్రంలోనే నంబర్​2 స్థానంలోకి తీసుకు వచ్చింది ఎవరని అన్నారు. వంటి మామిడిలో మీ మెడికల్ కాలేజీకి అనుమతి కోసం మేము ప్రయత్నం చేయలేదా.? అని ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీల భూములు కబ్జా చేసుకున్నారని చెబితే విచారణకు ఆదేశించడం తప్పా.. ఆర్టీసీ సమ్మె చేయించి ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి యత్నించిన అశ్వత్థామరెడ్డితో గంటల పాటు ఏం మీటింగులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశంలోని విషయాలు బయట పెట్టడం కరెక్టేనా అని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్, అంబేడ్కర్, పూలే వంటి వాడిని అని చెప్పి.. బీజేపీలో ఎలా చేరారని అన్నారు. కరీంనగర్ ప్రజలు ముందు నుంచి టీఆర్ఎస్, కేసీఆర్‌కు మద్దుతుగా నిలిచారు. భవిష్యత్‌లోనూ వారు టీఆర్ఎస్‌కు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా తెలంగాణకు ఏమీచేయని బీజేపీ.. ఇప్పుడేం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story