రేవంత్ బామ్మర్థి అక్రమ కట్టడాలు కడుతున్నారు: బాల్కసుమన్

by Shyam |
MLA Balka Suman
X

దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైర్ అయ్యారు. 111 జీవో పరిధిలో వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 66/ఈ లో రేవంత్‌రెడ్డి బామ్మర్థి జయప్రకాశ్‌రెడ్డి అక్రమ కట్టడాలు కడుతున్నారని దీనిపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చశారు. ఎదుటివారిపై బురదజల్లడం రేవంత్ రెడ్డికి అలవాటేనని, నీపేరు, నీ బంధువుల పేర్ల మీద ఉన్న భూములపై ముందుగా సూటిగా సమాధానం చెప్పాలని ప్రశ్నలు సంధించారు. రేవంత్.. మంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆదివారం బాల్కసుమన్, కర్నె ప్రభాకర్‌ అసెంబ్లీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్లాక్ మెయిల్‌కి కేరాఫ్ అడ్రస్ రేవంత్ అని.. ఆయన గోపన్‌పల్లిలో దళితులను బెదిరించి భూములు లాక్కున్నారని విమర్శించారు. కేటీఆర్ ఎదుగుదలను జీర్ణించుకోలేని రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

రేవంత్ వ్యవహారం చూస్తే దొంగే.. దొంగ అన్నట్లుగా ఉందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. రేవంత్ లాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమన్నారు. టీఆర్ఎస్ నేతలు ధర్మానికి కట్టుబడి ఉన్నారని, ప్రజలంతా ఒకవైపు ఉంటే రేవంత్ టీమ్ మరోవైపు ఉంటుందన్నారు. 111 జీవో పరిధిలో కాంగ్రెస్ పార్టీ నేతల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని వీహెచ్ చెప్పారని, దీనికి కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పాలన్నారు.

Advertisement

Next Story