- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో ‘చిన్నారి పెళ్లి కూతురు 2’.. టీజర్ రిలీజ్
దిశ, సినిమా : ‘బాలికా వధూ( చిన్నారి పెళ్లి కూతురు)’ సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ ద్వారానే ఆనందిగా ప్రేక్షకులకు పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ అవికా గోర్.. ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తోంది. కాగా ఈ సక్సెస్‌ఫుల్ సీరియల్‌కు సీక్వెల్ తీసుకురావాలని ప్రేక్షకులు డిమాండ్ చేయడంతో కలర్స్ టీవీ ‘బాలికా వధూ’ సీజన్ 2 టీజర్ లాంచ్ చేసింది. బొమ్మను పట్టుకుని తల్లివైపు పరుగెడుతున్న చిన్నారి అందాన్ని చూసి మురిసిపోయిన తల్లి.. ఈ రాజకుమారికి రాకుమారుడిని వెతకాలి అంటుంది. ఆ తర్వాత ఈ చిన్నారి పెళ్లి కూతురు అవతార్‌లో కనిపించగా.. బ్యాక్ గ్రౌండ్‌లో ‘బాల్య వివాహం, దుష్ప్రవర్తన ఇప్పటికీ సమాజంలో సజీవంగా ఉంది. దీన్ని నిర్మూలించడానికి కొత్త ఆనందీ, కొత్త ఆడపిల్ల పుట్టింది’ అనే వాయిస్ వినిపిస్తుంది.
ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు ఫస్ట్ సీజన్‌ను గుర్తుచేసుకుంటూ కామెంట్స్ పెట్టారు. ‘బాలికా వధూ’లో ఎదిగిన ఆనంది పాత్రలో కనిపించిన లేట్ యాక్ట్రెస్ ప్రత్యూష బెనర్జీని స్మరించుకున్న ఆడియన్స్.. సీజన్ 2 కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపారు. కాగా ‘బాలికా వధూ ’ షూటింగ్ లాస్ట్ వీక్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత ముంబైలో నెక్స్ట్ షెడ్యూల్ ఉండనుండగా.. శ్రీయా పటేల్, వంశ్ సయానీ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.