స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం : ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం

by srinivas |   ( Updated:2021-07-11 04:07:15.0  )
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం : ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు స్టీల్ ప్లాంట్ ఆయువులాంటిదని ఏపీ ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రాణాల త్యాగం ఫలితంగా వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. ఎన్నికష్టాలు ఎదురైనా స్టీల్ ప్లాంట్‌ను వదులుకోడానికి తాము సిద్ధంగా లేమన్నారు. బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ని విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరిశ్రమల వల్లే విశాఖకి రాజధాని వస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికే స్టీల్ ప్లాంట్ ఒక్క ఆయువు లాంటిదని విఠల్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

Advertisement

Next Story