ఏపీకి బాలయ్య విరాళం 50 లక్షలు

by srinivas |
ఏపీకి బాలయ్య విరాళం 50 లక్షలు
X

కరోనా వ్యాప్తి కట్టడికి టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ తన వంతు సాయాన్ని అందించారు. మొత్తం రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కేటాయించారు. సినీనటుడు చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.25 లక్షలు అందించారు. ఈ నేపధ్యంలో సీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు సీ కల్యాణ్‌కు ఈ రూ.25 లక్షల చెక్‌ను బాలయ్య అందించారు. ఈ మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తారు.

Tags: balakrishna, actor, corona charity, balayya, tdp mla, hindupur mla

Advertisement

Next Story

Most Viewed