- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాక్‌డౌన్ ఎలా ఎదుర్కోవాలో తెలుసు : బాలాజీ
దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజీబిజీగా బయట తిరిగే వాళ్ళంతా ఇప్పుడు జైల్‌లో పెట్టినట్లు ఇబ్బంది పడిపోతున్నారు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి పరిస్థితీ అదే. కాగా, ఈ లాక్‌డౌన్‌ను ఎలా ఎదుర్కోవాలో నాకు గతంలోనే తెలిసిపోయిందని టీం ఇండియా, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మాజీ ఆటగాడు లక్ష్మీపతి బాలాజీ చెబుతుండటం విశేషం. ‘నాకు వెన్నునొప్పి సర్జరీ జరిగినప్పుడు రెండేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. ఇంట్లోనే ఏమీ చేయకుండా కూర్చునేవాడిని. మొదట్లో చాలా నరకంగా ఉండేది. కానీ ఆ సమయంలో తనను తాను ధృడంగా మలచుకున్నా’ అని బాలాజీ చెప్పాడు.
ఇప్పుడు ప్రజలందరికీ దొరికిన సమయాన్ని గౌరవించాలి. ఈ రోజు ఎలా గడపాలా అనుకుంటే కష్టంగా ఉంటుంది. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకొని భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నాడు.
ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో అందరూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని బాలాజీ కోరాడు. చిన్న జ్వరమొస్తేనే మనం డాక్టర్లు చెప్పినట్లు నడుచుకుంటాం. మరి ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి ? కాబట్టి ప్రజలందరూ తమ ఆరోగ్యాలతో పాటు పక్కన వారి ఆరోగ్యాల గురించి కూడా ఆలోచించాలని కోరాడు.
Tags: Lock down, Laxmipathi Balaji, Cricketer, Future plans, Health concious