- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హీరోను దాటి దూసుకెళ్లిన బజాజ్!
దిశ, సెంట్రల్ డెస్క్: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీగా ఉన్న హీరో మోటోకార్ప్‌ను దాటి మరో దిగ్గజ కంపెనీ బజాజ్ విక్రయాల్లో ముందుకొచ్చింది. మే నెలలో బజాజ్ కంపెనీ 1,12,798 యూనిట్ల వాహనాలను విక్రయించగా, హీరో మోటోకార్ప్ 1,12,682 యూనిట్లకు పరిమితమైంది. ఏప్రిల్‌లో దేశీ అమ్మకాలు లేకపోయినా, ఎగుమతుల్లో మంచి పనితీరు కనబర్చిన బజాజ్.. హీరో కంపెనీని దాటి మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ఎగుమతులు పెరగడంతో బజాజ్ కంపెనీకి బాగా కలిసొచ్చింది. జనవరిలో మార్కెట్లో విడుదల చేసిన బజాజ్ ఈ-చేతక్ స్కూటర్‌తో, స్కూటర్ విభాగంలోనూ దూకుడు పెంచాలని బజాజ్ కంపెనీ భావిస్తోంది. బజాజ్ కంపెనీ మే నెలలో ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఎగుమతులను మాత్రమే 65 శాతం వాటాను విక్రయించాయి. దేశీయ మార్కెట్లో 39,286 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ స్పీడుతోనే హీరో మోటోకార్ప్‌ను దాటి దూసుకెళ్లింది. హీరో కంపెనీ మొత్తం విక్రయాల్లో 3.5 శాతం కన్నా తక్కువ విక్రయాలను నమోదు చేసింది. లాక్‌డౌన్ సమయంలో మొత్తం ద్విచక్ర వాహనాలకు అధిక డిమాండ్ ఏర్పడింది. దీంతో బజాజ్ ఆటోనే కాకుండా టీవీఎస్ కంపెనీకి కూడా బాగా కలిసొచ్చింది. టీవీఎస్ కూడా హోండా కంటే ఎక్కువ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అపాచీ, జూపిటర్ మోడళ్లకు అధిక డిమాండ్ ఉండటంతో మే నెలలో టీవీఎస్ 56,218 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో టీవీఎస్ కంపెనీ మొదటిసారిగా హోండా కంటే ఎక్కువ విక్రయాలు నమోదు చేయగలిగింది. ఎగుమతుల్లో 27 శాతం వాటాను దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నాటికి హీరో మోటోకార్ప్ దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా నిలిచింది. మొత్తం అమ్మకాలు (దేశీయ, ఎగుమతులు) 64 లక్షల యూనిట్లకు పైగా డగా, హోండా తరువాత స్థానంలో 50 లక్షలకు పైగా యూనిట్లను అమ్మగలిగింది. బజాజ్ మార్చిలో సుమారు 39.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మూడవ స్థానంలో నిలిచింది.