- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బజాజ్ ఆటో నికర లాభాలు 23శాతం వృద్ధి
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో నికర లాభాలు 23 శాతం వృద్ధితో రూ. 1,556 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,262 కోట్లుగా నమోదైంది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం 17 శాతం పెరిగి రూ. 8,910 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ స్వతంత్ర ఆదాయం 17 శాతం పెరిగి రూ. 8,910 కోట్లకు చేరుకున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఇదే సమయంలో డిసెంబర్ త్రైమాసికానికి బజాజ్ ఆటో దేశీయ అమ్మకాలు 3 శాతం క్షీణించాయి. ఇందులో వాణిజ్య వాహనాల అమ్మకాలు 65 శాతం తగ్గాయి. అయితే, దేశీయ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 8 శాతం పెరిగి 5.85 లక్షల యూనిట్లకు చేరుకున్నట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. పల్సర్, కేటీఎం, హస్క్‌వర్ణా బైకుల పటిష్ఠమైన డిమాండ్ నేపథ్యంలో కంపెనీ ద్విచక్ర వాహనాలు పెరుగుతునాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయ మోటార్‌సైకిల్ మార్కెట్లో కంపెనీ వాటా 18.5 శాతానికి పెరిగిందని, ఇంతకుముందు ఏడాది ఇది 17.5 శాతం ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.