మేమూ రాం.. మీరూ రావొద్దు

by vinod kumar |   ( Updated:2020-03-30 05:37:29.0  )
మేమూ రాం.. మీరూ రావొద్దు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామ ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇతర గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. విషయమేమిటంటే.. ఆ గ్రామంలో కొంతమంది తమ ఇంటి ముందు ఒక పేపర్ అంటించి ఉంచారు. దానిపై … ‘కరోనా కారణంగా మేము మీ ఇంటికి రాము.. మీరూ మా ఇంటికి రావొద్దు.. తప్పని పరిస్థితుల్లో వస్తే సబ్బుతో శుభ్రంగా కడుక్కొని లోపలికి రాగలరు’ అని రాశారు. కిరాణా షాపులు, కూరగాయల షాపులవారు కూడా తమ షాపునకు వచ్చేవారు విధిగా సామాజిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరికీ చెబుతున్నారు. అది చూసిన ప్రతి ఒక్కరూ వారిని మెచ్చుకుంటూ ప్రభుత్వ సూచనలను సరిగ్గా పాటిస్తున్నారని ప్రశంసిస్తున్నారు.

Tags : corona effect, yadadri, bahupeta, taking care

Advertisement

Next Story

Most Viewed