రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం లీడర్లు..

by Sridhar Babu |   ( Updated:2021-11-01 19:04:37.0  )
రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం లీడర్లు..
X

దిశ, టేకులపల్లి : నగరంలోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని టీపీసీసీ స్టేట్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. దీనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్రావు, చీమల వెంకటేశ్వర్లు హాజరై రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జెనరెడ్డి భరత్ చంద్రా రెడ్డి, బయ్యారం మండలం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండేళ్ల గడ్డ గ్రామం చీమల రాజు హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈయన సుమారు పదకొండు సంవత్సరాలు అజ్ఞాతంలో ఒక దళ కమాండర్‌గా పనిచేసినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు చీమలరాజు టీఆర్ఎస్ కనకయ్య వర్గంలో కీలకంగా పనిచేశారు. అధికార పార్టీ అనుసరించే విధానాలు నచ్చక కాంగ్రెస్‌లో చేరినట్టు ఆయన ప్రకటించాడు. కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు ఎం ఏ జలీల్, ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి సైదులు, పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియోల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story