పీవీ సింధుకు షాక్

by Anukaran |
పీవీ సింధుకు షాక్
X

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సత్తా చాటాలనుకుంటున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) షాక్ ఇచ్చింది. ఈ ఏడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌ టోర్నీని బీడబ్ల్యూఎఫ్ రీ షెడ్యూల్ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీలో వరల్డ్ చాంపియన్‌ పీవీ సింధుకు డైరెక్ట్ ఎంట్రీ ఉండదు. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం వరల్డ్ చాంపియన్‌కు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో నేరుగా ఎంట్రీ ఉంటుంది.

కానీ, కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రస్తుత ఏడాది బ్యాడ్మింటన్ క్యాలెండర్‌‌కు విఘాతం కలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఎవరికీ డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వకూడదని నిర్ణయించింది. నూతన నిబంధనల ప్రకారం బ్యాంకాక్‌లో జరగనున్న వరల్డ్ టూర్ ఫైనల్స్-2020కు ఈ ఏడాది సాధించిన పాయింట్ల ఆధారంగా క్రీడాకారులు అర్హత సాధిస్తారు అని డబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది పీవీ సింధు వరల్డ్ చాంపియన్‌‌ షిప్‌లో విజయం సాధించింది.

అయితే, ఈ ఏడాదిలో జరిగిన డెన్మార్క్ ఓపెన్ నుంచి వైదొలిగింది. ఏసియన్ టోర్నీల్లో సత్తా చాటితే కాని వరల్డ్ టూర్ ఫైనల్స్ ఆడే అవకాశం సింధుకు లభించకపోవచ్చు. ‘ఇప్పటికే సింధు వరల్డ్ చాంపియన్. గతంలోనే వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో మా ప్రధాన లక్ష్యం ఆల్ ఇంగ్లండ్, ఒలింపిక్స్ మాత్రమే’ అని పీవీ సింధు తండ్రి రమణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed