- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాడమీకి.. అనుమతి ఇవ్వండి !
దిశ, తెలంగాణ బ్యూరో: జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేరుతో ఔత్సాహికులకు బ్యాడ్మింటన్ శిక్షణ ఇవ్వాలనుకుంటున్నానని, దానికి అవసరమైన అనుమతిని మంజూరు చేయాలని మంత్రి శ్రీనివాస గౌడ్‌కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విజ్ఞప్తి చేశారు. అకాడమీ పెట్టాల్సిన అవసరం, ఇకపైన శిక్షణ ద్వారా క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారికి కలిగే ప్రయోజనం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇచ్చే శిక్షణ ద్వారా తెలంగాణకు రానున్న గుర్తింపు తదితరాలన్నింటినీ మంత్రికి గుత్తా జ్వాల వివరించారు. రాష్ట్ర క్రీడా శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే శిక్షణ ప్రారంభమవుతుందని వివరించారు.
ప్రతీ సంవత్సరం సీఎం కప్ పేరిట పోటీలను నిర్వహిస్తామని, ఇందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తరపున అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అకాడమీ ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని తెలియజేస్తుందని జ్వాలకు హామీ ఇచ్చారు.