- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో కంపు కొడుతున్న ‘వైద్యం’..
దిశ, కోటగిరి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో గల ఆరోగ్య ఉప కేంద్రం పరిస్థితి దయనీయంగా మారింది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ సెంటర్‌గా ఎంపిక చేసిన ఆరోగ్య ఉప కేంద్రంలోని ప్రాంగణం చుట్టూ అ సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. సదరు కాలనీ వాసులు బహిరంగంగా మలమూత్ర విసర్జన చేస్తున్నారని, దానివలన వ్యాక్సినేషన్ కోసం వచ్చే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా నిత్యం ఆ కేంద్రంలోనే విధులు నిర్వహించడం తమకు ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. తమ సమస్య గురించి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిమార్లు వినతి చేసిన ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. ఆరోగ్య ఉప కేంద్రం చుట్టూ పందులు తిరుగుతున్నాయని, దీంతో తాము కొత్త వ్యాధుల బారిన పడే ఆస్కారముందని సిబ్బంది వాపోతున్నారు.