- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ బ్యాంకుల బ్యాడ్ లోన్స్, క్రెడిట్ ఖర్చులు పెరుగొచ్చు’
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు సులభతర నగదు సరఫరా కారణంగా దేశీయ బ్యాంకుల క్రెడిట్ ఖర్చులు పెరుగుతాయని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ సోమవారం తెలిపింది. అంతేకాకుండా బ్యాడ్ లోన్స్ కూడా పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ఇదివరకే సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక రంగానికి గతేడాది కరోనా కారణంగా మరిన్ని సమస్యలు ఉత్పనమయ్యాయి. అయితే, ఇటీవలి త్రైమాసిక ఫలితాలల్లో నికర లాభాలు, ఆస్తుల నాణ్యతలో మెరుగుదల చూపించాయని ఫిచ్ పేర్కొంది.
చిన్న వ్యాపారాలపై కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోందని, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలతో బ్యాంకులు ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా ఆర్థిక వ్యవస్థకు, చిన్న వ్యాపారాలకు దెబ్బ పడింది. అధిక నిరుద్యోగం, క్షీణిస్తున్న వినియోగం వంటి అంశాలు బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లలో స్పష్టంగా కనిపించడం లేదని ఫిచ్ వివరించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ తిరిగి వృద్ధి చెందింది. అయితే, చాలా రంగాలు సామర్థ్యం కంటే తక్కువగానే పనిచేస్తున్నాయని గుర్తించాలి. ఇప్పటికే రిటైల్ కస్టమర్లలో ఒత్తిడి కొనసాగుతోందని పలు రేటింగ్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయని ఫిచ్ తన నివేదికలో వెల్లడించింది. తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో బ్యాంకుల బ్యాడ్ లోన్స్ 14.8 శాతానికి పెరుగుతుందని ఆర్‌బీఐ జనవరిలో హెచ్చరించిందని ఫిచ్ ప్రస్తావించింది.