‘బేబీ తలైవా’.. సమీరా కూతురి థ్రిల్లింగ్ స్టైల్

by Shyam |
‘బేబీ తలైవా’.. సమీరా కూతురి థ్రిల్లింగ్ స్టైల్
X

తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌ సరసన రెండు సినిమాలు చేసిన సమీరా రెడ్డి.. జై చిరంజీవ సినిమాలో చిరంజీవితోనూ ఆడిపాడింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఆ మధ్య ‘గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తూ తాను గర్భిణీగా ఉన్నప్పుడు చేసిన ఫొటో షూట్‌తో మహిళల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. ఒక నటిగా సెలబ్రిటీ హోదాను అనుభవించే కన్నా.. తల్లిగా ఉండటం గొప్ప వరం అని రియలైజ్ అయ్యాక నా ప్రపంచం చాలా ఆనందంగా మారింది’ అని తెలిపింది.

https://www.instagram.com/p/CAHa-BpnzXy/?utm_source=ig_web_copy_link

ప్రస్తుతం తల్లిగా ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్న సమీరా.. తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్న వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా షేకయ్యే ఓ వీడియోను పోస్ట్ చేసింది. 10 నెలల తన కూతురు నైరా.. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో గ్లాసెస్ పెట్టుకుంటుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో తలైవా మ్యూజిక్‌తో అదిరిపోయే వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మాస్ బేబీ.. బేబీ తలైవా క్యాప్షన్‌తో సమీరా చేసిన పోస్ట్‌కు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది. 10 నెలల పాప పర్ఫెక్ట్ స్టాండింగ్ ఫోజ్‌కు నెటిజన్లు ఫిదా కాగా ఆ క్యూట్‌నెస్‌కు మతిపోతుందంతే అంటున్నారు. మరికొందరు రజినీకి సరైన పోటీ ఇచ్చేది నైరా ఒక్కతే అంటూ ఆశీర్వదిస్తున్నారు. కాగా ఈ వీడియోను సమీరానే ఎడిట్ చేసిందట.

Advertisement

Next Story