రమ్యను హత్య చేసిన మృగాడిని శిక్షించాలి : నారా లోకేశ్

by srinivas |
lokesh-babu
X

దిశ, ఏపీ బ్యూరో: రమ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.‘దిశ’ చట్టం అంటూ జగన్ రెడ్డి బిగ్గరగా అరవడం.. వైసీపీ బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప రాష్ట్రంలో ఒక్క ఆడబిడ్డకైనా న్యాయం జరిగిందా అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం..రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారు? అంటూ లోకేష్ ట్విటర్ వేదిగా ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఇంటి పక్కన, సొంత నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోవడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమంటూ ఘాటుగా విమర్శించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యనభ్యసిస్తూ బంగారు భవిష్యత్తు ఉన్న రమ్య ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్యని హత్య చేసిన మృగాడిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed