కాటారంలో అయ్యప్ప పూజ.. భారీగా తరలివచ్చిన భక్తులు

by Sridhar Babu |
Ayyappa-Puja-2
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి గ్రామంలోని అయ్యప్ప దేవాలయంలో మంగళవారం రాత్రి పదునెట్టాంబడి మహా పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. 41 రోజుల దీక్ష పూనిన అయ్యప్పస్వాములు శరణుఘోష ఆలపిస్తుండగా మహా పడిపూజను నిర్వహించారు. గారిపెళ్లి గ్రామానికి చెందిన ముష్కమల్ల ప్రేమలత-సత్యం అయ్యప్ప దీక్షను తీసుకొని 18 సంవత్సరాల దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మహాపడిపూజను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి ప్రాంతానికి చెందిన బ్రహ్మ శ్రీ శ్రీ జి. వి. శాస్త్రీ, మాడుగుల నాగరాజు శర్మ , భానుప్రాసాద్ నేతృత్వంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ మహాపడిపూజ జరిగింది. దేవతామూర్తులకు ఘనంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. జనులు భక్తి కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ కమిటీ శాశ్వత చైర్మన్ బచ్చు అశోక్, ప్రస్తుత చైర్మన్ బచ్చు ప్రకాష్, పుల్లూరు రాజేశ్వరరావు గురుస్వాములు రామకృష్ణ స్వామి, చీమల రాజు స్వామి, జక్కు మొగిలి స్వామిలతోపాటు భజన బృందం సభ్యులు మద్ది నవీన్ కుమార్, చీమల మల్లయ్య, బొల్లం సతీష్, రాజు, గౌరోజు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Ayyappa-Puja-1

Advertisement

Next Story