గారెపల్లిలో అయ్యప్ప అరాట్టు ఊరేగింపు

by Sridhar Babu |
Ayyappa-Puja1
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గారిపల్లిలో శ్రీ ఆనంద ధర్మశాస్త అయ్యప్ప దేవాలయ ఉత్సవమూర్తులను ఆదివారం గారెపెళ్లి పురవీధులలో ఘనంగా ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషల మధ్య నృత్యాలు చేస్తూ వివిధ భంగిమలతో ఒకరికొకరు పై రంగులు చల్లుకుంటూ భక్తి పారవశ్యంతో తేలియాడారు. దేవాలయంలో అయ్యప్ప స్వామికి ఘనంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ స్వామి శరణు ఘోష పిలుపుతో అయ్యప్ప స్వామి రథాన్ని గ్రామం వీధుల గుండా లాగారు. అయ్యప్ప ఉరేగింపు వ్రతానికి గ్రామంలోని మహిళలందరూ ఇంటింటా మంగళ హారతులు ఇస్తూ, టెంకాయలు కొడుతూ తమ మొక్కులను సమర్పించుకున్నారు. గ్రామంలోని వీధులలో ఊరేగింపు తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరంలోని గోదావరి నదిలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నానం చేయించారు. బ్రహ్మశ్రీ శ్రీ జి. వి. శాస్త్రీ, ఆలయ పూజారి భాను ప్రసాద్ శర్మ, ఆంజనేయ దేవాలయ పూజారి మాడుగుల నాగఫణి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములు, గురుస్వామి శనిగరం రామ్ రెడ్డి, చీమల రాజు, రంజిత్, లచ్చి రెడ్డి , పసుల రామచంద్రం, జీపు సత్యం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed