బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద ట్రీట్‌మెంట్..

by Shyam |
బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద ట్రీట్‌మెంట్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పాజిటివ్ బారిన పడి ఎక్కువ రోజులు ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్లకు ఇప్పుడు వస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులకు త్వరలో ఆయుర్వేద చికిత్స అందనుంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్ పేషెంట్లకు, ఈఎన్‌టీ ఆస్పత్రిలో పాజిటివ్ నుంచి కోలుకుని బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న పేషెంట్లకు అల్లోపతి ట్రీట్‌మెంట్‌తో పాటు ఆయుర్వేద మందుల్ని కూడా ఇవ్వాలని ఆయుర్వేద కళాశాల నిర్ణయించింది.

ఇందుకోసం ఈ రెండు ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యుల బృందాల్ని నియమించనున్నట్లు ‘ఆయుష్‘ విభాగం డైరెక్టర్ డాక్టర్ అళగు వర్షిణి తెలిపారు. బ్లాక్ ఫంగస్ బారినపడిన పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవల్‌లో తేడాలు ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారని, దీన్ని అదుపులోకి తేవడానికి ఆయుర్వేద మందులు ఉపయోగపడతాయని వివరించారు. ఒకవైపు అల్లోపతి ట్రీట్‌మెంట్ కొనసాగుతుండగానే ఆయుర్వేద వైద్య చికిత్సలను కూడా అందించనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఈ మందుల్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed