- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాట్ న్యూస్.. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ.. వారిలో టెన్షన్!
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అంటే బహుశా తెలియని వారు ఉండకపోవచ్చు. కరోనా సమయంలో మహమ్మారికి మందును పంపిణీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఆనందయ్య. ఇదిలా ఉండగా ఆనందయ్య మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
త్వరలోనే తాను పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం విశాఖలోని అనకాపల్లిలో నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ఆనందయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని.. అందుకే తాను బీసీ జేఏసీతో కలిసి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఆనందయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు.