- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ స్టోరీ..లవ్‌లీ ట్రీట్
లవ్ స్టోరీ మూవీ టీం… వాలెంటైన్స్ డే రోజు లవ్‌లీ ట్రీట్ ఇచ్చింది. ఏయ్ పిల్లా మూజికల్ ప్రివ్యూ విడుదల చేసి… ప్రేమికులకు ప్రేమికుల రోజున మంచి ఫీల్ గుడ్ సాంగ్‌ను అందించింది. ‘ఏయ్ పిల్లా పరుగున పోదామా’ అనే పాటలో నాగచైతన్య, సాయి పల్లవిలు లవ్ బర్డ్స్‌గా మెస్మరైజ్ చేసేలా ఉన్నారు. ఇద్దరి జోడి ప్రేక్షకులకు తెరపై కొత్తగా కనిపిస్తుంది. సాంగ్ ఎండింగ్‌లో సాయి పల్లవి కిస్‌తో ఫీల్ అయిపోయిన చైతు ఏడ్చే సీన్ హైలెట్ కాగా.. ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తరా’ అని సాయిపల్లవి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సీన్‌లో చైతు పర్‌పార్మెన్స్ ది బెస్ట్‌గా ఉంది. ఇక సాయిపల్లవి తనదైన రీతిలో అల్లరి పిల్లగా ఉండగా.. సినిమాలో చైతు ప్రేమ కోసం తపించే వ్యక్తిగా కనిపిస్తాడేమో మరి. సాంగ్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మార్క్ కనిపిస్తుండగా.. పవన్ సిహెచ్ లవ్ స్టోరీ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ ప్రొడక్షన్స్‌లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.