- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నాయకులు సనాతన ధర్మ వ్యతిరేకులు.. బీజేపీ సంచలన పోస్టర్
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని పలువురు ప్రతిపక్ష నేతలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా వేడుక ఆహ్వానాన్ని తిరస్కరించిన నేతలను సనాతన ధర్మ వ్యతిరేకులుగా అభివర్ణించింది. ఈమేరకు హాటు విమర్శలతో ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ‘‘సనాతన ధర్మ వ్యతిరేకుల ముఖాలను గమనించండి. వీటిని గుర్తుంచుకోండి’’ అని ఇందులో పేర్కొంది. ఆయా నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలన్నీ హిందూ వ్యతిరేకులని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ పోస్టర్‌లో కాంగ్రెస్,వామపక్షాలు, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, సీతారాం ఏచూరి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ఫోటోలు ఉన్నాయి. తాము ఈ వేడుకలకు హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. రామాలయ ప్రారంభోత్సవ వేడుకను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌లా మార్చేశారని హస్తం పార్టీ విమర్శించింది.
पहचानिए, राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के न्योते को ठुकराने वाले सनातन विरोधियों के चेहरे... pic.twitter.com/0ESH0eYUt1
— BJP (@BJP4India) January 11, 2024