దివ్య మనోహర దృశ్య కావ్యం.. అయోధ్య శ్రీరామ మందిరం (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-01-21 16:28:27.0  )
దివ్య మనోహర దృశ్య కావ్యం.. అయోధ్య శ్రీరామ మందిరం (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: బాల రాముడి ప్రాణప్రతిష్ట క్రతువు సందర్భంగా అయోధ్యలోని రామ మందిరాన్ని పూలతో అందంగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలతో జై శ్రీరామ్ అనే స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రామ మందిరంలో ప్రధాన ద్వారం, ఎదురుగా మెట్లకు ఇరువైపులా గులాబీలతో ముస్తాబు చేశారు. ఇక ఆలయం లోపలి భాగంతో ప్రతి మూలన ఆకట్టుకునే లైటింగ్ ఏర్పాటు చేసి.. బ్యాక్‌గ్రౌండ్‌లో పూలను ఏర్పాట చేశారు. మొత్తం మీద ఆధ్యాత్మిక నగరం అయోధ్యను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇవాళ రాత్రి 10 లక్షల దీపాలతో ఆలయ పరిసరాలను అలంకరించబోతున్నారు. సరిగ్గా రేపు మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమం ప్రారంభం కానుంది.



Advertisement

Next Story