- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యలోని రాముడ్ని దర్శించుకునేందుకు ఏ సమయంలో వెళ్లాలి.. ఎలా వెళ్లాలి? దర్శన వేళల్లో మార్పులు చేసిన ట్రస్ట్
దిశ, ఫీచర్స్: 500 ల ఏళ్ల నాటి హిందువుల చిరకాల కళ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా ముగిసింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర చేతుల మీదుగా జరిగింది. దేశంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రముఖ సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు హాజరై అయోధ్యలోని రామమందిరంలో సందడి చేశారు. అయితే అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన కొన్ని రోజుల తర్వాతే రాముడిని దర్శించుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
బాలరాముడ్ని దర్శనం కోసం భక్తులు క్యూలు కట్టి వేచి చూస్తున్నారు. కాగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఆలయ ట్రస్ట్ ఆరతి, దర్శనానికి సంబంధించిన కొత్తగా అప్‌డేట్ చేసిన షెడ్యూల్‌లను రిలీజ్ చేసింది. భక్తులకు పూజలు చేసే అవకాశం కల్పించేందుకు ఆలయ ట్రస్ట్ దర్శన వేళల్లో మార్పులు చేసింది. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం..
దర్శన టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి? ఎన్ని గంటలు దర్శనానికి అనుమతిస్తారు. రాముడి దర్శనానికి ఏదైనా పాస్ అవసరమా? అక్కడ ఎన్ని రోజులు ఉండొచ్చు? ఏఏ సమయాల్లో దర్శనం ఉంటుంది? అని చాలా మందిలో ప్రశ్నలు తలెత్తే ఉంటాయి. కొంతమందిలో అయోధ్యను ఏ మార్గంలో వెళ్లాలి అని ప్రశ్నలు కూడా తలెత్తే ఉంటాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* అయోధ్యకు చేరుకోవడం ఎలాగంటే: అయోధ్య చేరుకునే భక్తులు రోడ్డు, రైలు, వాయు (విమాన) మార్గాల్లో చేరుకోవచ్చు.
* ఆలయ దర్శన సమయం: ఆలయంలోని బాలరాముడిని దర్శించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.
* ఎంట్రీ ఫీజు: రామమందిర దర్శనానికి వెళ్లే భక్తులకు సాధారణ ప్రవేశానికి ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఫ్రీగానే అనుమతి ఉంటుంది.
* ఆరతి దర్శనానికి టైమింగ్స్: రామ్ లల్లా విగ్రహానికి శృంగార్ ఆరతి (ప్రార్థన) ఉదయం 6:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు భోగీ ఆరతి ఉంటుంది. రాత్రి 7.30 గంటల నుంచి సంధ్య ఆరతి కోసం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
* ఆరతి దర్శనానికి పాస్ కోసం ఎంత చెల్లించాలి: ఆరతి దర్శనానికి తప్పనిసరిగా పాస్ ఉండాలి. కానీ, ఆరతి దర్శనం భక్తులకు ఉచితంగా అనుమతి ఉంటుంది.
* ఆరతి లేదా దర్శనానికి టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?
* ఆరతి లేదా బాలరాముని దర్శనానికి టికెట్లను ఆలయ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. https://online.srjbtkshetra.org వెబ్ సైట్ ద్వారా దర్శన టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
* ప్రస్తుతానికి బుకింగ్ హోల్డ్ చేసి ఉంచడం జరిగింది.
* అయోధ్యలో బాలరాముని దర్శన కోసం వెళ్లిన భక్తులు ఒకటి రెండ్రోజులు బస చేయవచ్చు.