- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రియలిస్టిక్ షుగర్ ఫ్లవర్స్.. రియల్లీ గుడ్
దిశ, ఫీచర్స్ : ఎన్నో వర్ణాలతో కనువిందుచేసే గులాబీల అందం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మత్తెక్కించే సువాసనను వెదజల్లే ఈ పూల నుంచి విడిపోయిన పూరెక్కలు కూడా అమితంగా ఆకర్షిస్తాయి. అయితే మెల్‌బోర్న్‌కు చెందిన మిచెల్ న్యుయెన్ చేతిలో ప్రాణం పోసుకున్న గులాబీలు మాత్రం మిమ్మల్ని ఊరించడంతో పాటు కళ్లను మాయ చేస్తాయి. ఎందుకంటే అవి షుగర్‌తో రూపొందిన ఫ్లవర్స్. ప్రపంచంలోనే లీడింగ్ షుగర్ ఆర్టిస్ట్‌గా పేరొందిన న్యుయెన్ ఆర్ట్ వర్క్స్ చూస్తే.. ‘అద్భుతం’ అనకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో. నిజమైన పువ్వేదో, షుగర్ పువ్వేదో తేల్చుకోలేక పోతామంటే.. ఆ ప్రత్యేకత కచ్చితంగా ఆర్టిస్ట్‌దే.
అంత పర్‌ఫెక్ట్‌గా పూలకు జీవం పోయాలంటే ఆషామాషీ విషయం కాకపోయినా, న్యుయెన్‌కు మాత్రం అది వెన్నతో పెట్టిన విద్య. ఆమె చేతిలో వికసించిన కుసుమాలు, ఆ పూలకు అద్దుకున్న రంగులు, పచ్చదనం నింపుకున్న ఆకులు, చక్కెరతో ప్రాణం పోసుకున్న పూకాడలు, ముళ్లు.. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ చేయకుండా షుగర్ ఫ్లవర్స్‌ను తీర్చిదిద్దుతోంది న్యూయెన్. ఎనిమిదేళ్లకు పైగా ‘షుగర్ ఫ్లవర్’ ఆర్ట్స్‌లో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే షుగర్ ఫ్లవర్ ఈవెంట్స్‌కు హాజరవుతూ, తన ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది. షుగర్ ఫ్లవర్ ఆర్ట్ వర్క్‌ను నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు పాఠాలు కూడా చెబుతోంది. కేక్ డెకరేషన్స్ ఫెస్టివల్స్‌లోనూ పార్టిసిపేట్ చేసి తన కళను ప్రపంచానికి చాటుతోంది.