- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అవేశ్ ఖాన్.. భారత్ కు రావద్దు :బీసీసీఐ
X
దిశ, స్పోర్ట్స్: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అవేశ్ ఖాన్ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లకుండా యూఏఈలో ఉండాలని బీసీసీఐ కోరింది. టీ20 వరల్డ్ కప్ సమయంలో టీమ్ ఇండియాకు నెట్ బౌలర్‌గా సేవలు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. భారత జట్టు నెట్ ప్రాక్టీస్ కోసం ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకున్నది. తాజాగా అవేశ్ ఖాన్‌కు కూడా నెట్ బౌలర్‌గా అవకాశం కల్పించింది. ప్రస్తుతం నెట్ బౌలర్‌గానే జట్టులోకి తీసుకున్నా.. టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటే అతడికి ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశాన్ని కూడా బీసీసీఐ ఇచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో అవేశ్ ఖాన్ 23 వికెట్లు తీసుకున్నాడు. అత్యంత వేగవంతమైన బంతులు వేయడమే కాకుండా వికెట్లు కూడా తీసుకుంటుండటంతో అతడి సేవలను వినియోగించుకోవాలని బీసీసీఐ సెలెక్టర్లు భావించారు.
Advertisement
Next Story