‘ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు’

by srinivas |
‘ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు’
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని తీసుకుంటున్నా ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇంజనీరింగ్ వుమన్స్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా విశాఖ రాజధాని కాకుండా ఆగదన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుందని చెప్పారు. ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటోందని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Advertisement

Next Story